ఆత్రేయపురం,
పవిత్ర గోదావరి నది తీరాన, పచ్చని పంట పొలాల మద్య అత్రి మహా ముని తపస్సు చేసిన పరమ పవన గ్రామం మన ఆత్రేయపురం. కొన్ని వేల సంవత్సరముల కిందట అత్రి మహా ముని ఈ ప్రదేశం లో తపస్సు చేసారట, అందుకే ఆత్రేయపురం అనే పేరు వచ్చిందని పెద్దలు చెబుతుంటారు. మహారాష్ట్ర లోని నాశిక్ లో పుట్టిన పవిత్ర గోదావరిని గౌతమి, వశిష్ట గోదావరిలుగా వేరు చేసి, అందాల కోనసీమకు ముఖద్వారంగా నిలచింది ఆత్రేయపురం. సంవత్సర కాలం నీటి సదుపాయం, పచ్చని పంటపొలాలు అత్రేయపురానికి మరింత అందాన్ని తెచ్చాయి. బొబ్బర్లంక నుండి మెర్లపాలెం వరకు మొత్తం 17 గ్రామాలతో అత్యంత సుందరమైన మండలంగా అలరాలుతుంది. తెలుగు వారందరిని నోరూరించే మామిడి తాండ్ర, పూతరేకులు పేరుచెప్పగానే గుర్తోచేది అత్రేయపురమే. ఈ రెండు స్వీట్స్ తయారీ ఇక్కడ చిన్న తరహ పరిశ్రమ తరహాలో అవతున్నాయి అంటే ఎంత మంది వీటి ఫై ఆదారపడి జీవిస్తున్నారో అర్దమవుతుంది. ఆత్రేయపురం లో మహా శివుడు ఉమా మార్కండేయ స్వామి గాను, విష్ణు మూర్తి వేణు గోపాల స్వామి (కృష్ణుడు) అవతారం లోను కొలువు తీరి ఉన్నారు. మహా శక్తి అవతారమైన మహా లక్ష్మి అమ్మవారు గ్రామ దేవతగా గ్రామాన్ని రక్షిస్తూ ఉంటుంది. సంతానం లేని వారికీ సంతానాన్ని ప్రసాదించే శ్రీ సంతాన సుబ్రహ్మన్యేశ్వర స్వామి ఈ గ్రామం లో కొలువు తీరాడు. గ్రామానికి నది బొడ్డున ధర్మ పీటం, రావి చెట్టు గ్రామ ప్రతిష్టను కాపాడుతూ ఉంటాయి. వర్షాలు రాక కరువు కాలం వచ్చినప్పుడు ఈ రావి చెట్టుకి నీరు పోస్తే వర్షాలు కురుస్తాయి అని గ్రామ ప్రజల నమ్మకం. డెల్టా ప్రాంత పంటపొలాల కోసం ఉన్న ప్రధాన కాలువ ఆత్రేయపురం సమీపం లో లొల్ల లాకుల వద్ద ౩ కాలువలుగా చీలి ముక్తేశ్వరం, అమలాపురం, గన్నవరం మీదుగా నీటిని మొత్తం డెల్టాకు అందిస్తున్నాయి. ఈ కాలువలు విడే ప్రదేశం అత్యంత సుందరంగా ఉండి టూరిస్టులనే కాక సినిమా వారిని ఆకర్షిస్తుంది. ఆత్రేయపురం లో మహాత్మా గాంధీ జూనియర్ కళాశాల చుట్టూ ఉన్న గ్రామాల పిల్లల్ని విద్య వేత్తలుగా తీర్చి దిద్దుతుంది.
ఆత్రేయపురం మండలం లోని గ్రామాలు :
బొబ్బర్లంక, రాజవరం, పేరవరం, వెలిచేరు, వద్దిపర్రు, పులిదిండి, ఉచ్చిలి, వసంతవాడ, తాడిపూడి, ఆత్రేయపురం, లొల్ల, మెర్లపాలెం, ర్యాలి, కట్టుంగ, నార్కేడిమిల్లి, అంకంపాలెం మరియు వాడపల్లి.
ఆత్రేయపురం మండలం లోని గ్రామాలు :
బొబ్బర్లంక, రాజవరం, పేరవరం, వెలిచేరు, వద్దిపర్రు, పులిదిండి, ఉచ్చిలి, వసంతవాడ, తాడిపూడి, ఆత్రేయపురం, లొల్ల, మెర్లపాలెం, ర్యాలి, కట్టుంగ, నార్కేడిమిల్లి, అంకంపాలెం మరియు వాడపల్లి.
***ఆత్రేయపురం మండలం లోని ముఖ్యమైనవి***